ఎడెమఠ నాగిదేవయ్య గారి పుణ్యస్త్రీ మసణమ్మ
|
|
కాకి రెట్టను తిన్నవాళ్ళు లేరు
వ్రత భ్రష్టుని కూడిన వాళ్ళులేరు
కుక్కకు బత్తాయిపండు నచ్చుతుందా?
లోకంలోని నరులకు వ్రతం చెల్లుతుందా శివబీజానికి కాక
నీవే సాక్షి నిజగుణేశ్వర లింగంలో / 1302
[1]
ఎడెమఠ నాగిదేవయ్య గారి పుణ్యస్త్రీ మసణమ్మ: చోళ మండల రాజధాని కాంచీపురంలోని ఎడెమఠం (నైవేద్యమఠం) నాగిదేవయ్య ఈమె భర్త. అతనితో కలసివచ్చి కళ్యాణ నగరిలో నివాసం ఏర్పరచుకొంటారు. కాలం క్రి.శ.1160 "నిజగుణేశ్వరలింగ" అంకితముద్రతో ఈమె రచించిన ఒకేఒక్క వచనం దొరికింది. అందులో వ్రతమహాత్మ్యం, వ్రతభ్రష్టుల నిందలు ప్రస్తావింపబడినాయి.
Reference:
గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద
సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర
సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.
[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu",
ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation:
G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.
*