Previous స్వతంత్ర సిద్ధలింగేశ్వరుడు దేశికేంద్ర సంగన బసవయ్య Next

హేమగల్ల హంపన

మకుటం సిద్ధమల్లినాథ

అన్నపు గొడవలేని వాడికి
ఆరాటాల గొడవుంటుందా?
ఖేచర పవన సాధకునికి
భూచరమందడుగిడు కోరిక వుంటుందా?
వజ్రకవచం ధరించిన వాడికి
బాణపు భయ ముంటుందేమయ్యా
నిర్మాయునికి మాయపు ఆర్భాట ముంటుందా?
నిర్వ్యసనికి వ్యసనాల బెదరుంటుందా?
పరమగురు పడవిడి మల్లికార్జునిలో చేరినవాడికి
అన్యదైవాల భయం ఉంటుందా? /2489 [1]

హేమగల్ల హంపన: బహుశ హంపి పరిసర ప్రాంతీయుడనిపించే ఇతని నెలవు హే(వే)మగల్లు. కాలం సుమారు 17వ శతాబ్ధి. లింగాయత సాంప్రదాయంలో ముఖ్యమైన "పడువిడి" పంథాకు చేరినవాడు. గురువు రాజేశ్వరుడు. అంకితముద్ర "సిద్ధమల్లినాథ".

ఉలి బాడిసలకు లొంగని మోడు
గొడ్డలి కొడవళ్ళకు లొంగునా?
పురాతనుల వచనామృతమను ఉలితో చీల్చి
బాడిసతో చెక్కితే సిగ్గిల్లని మనసు
వేదాగమాలనే గొడ్డలి కొడవళ్ళకు తెగేనా? తెగదు
మోడైన మనస్సు, పీడైన మనస్సు, పాడైన మనస్సు
బంధిత మనస్సు, రగిలిన మనస్సు, సర్వ చండాలపు మనస్సు యోక్క
సంగపు వలలో చిక్కి భంగపడుతుంటినిరా
నిర్భంగ నిర్లేప నిజగురు నిశ్చింత స్వయంభూ
పరమగురు పడువిడి సిద్ధ మల్లినాథ ప్రభూ /2490 [1]

"హేమగల్లు షట్‍స్థల" ఇతని కృతి పేరు. పేరు సూచిస్తున్నట్లు ఆరు స్థలాల వచనాలను సంకలించి వుండవచ్చును. అయితే ఇప్పుడు లభ్యమయిన వచనం సంహిత భక్తిస్థలం వద్ద నిలిచింది. ఇందులో 23 స్థలాలున్నాయి. మోత్తం 282 వచనాలు. స్వరవచనాలు, 1 రగళె, 7 కందపద్యాలు కలిసివున్నాయి. షట్‍స్థల ప్రతిపాదనమే పరమధ్యేయం.

నడువలేని కుంటివాడికి గ్రుడ్డి పెళ్ళాము దొరికితే
నడువగలదా వారి జీవితయానం?
మాటాడలేని మూగకు వహారాజు పట్టం లభిస్తే
ప్రజా, పరివార, రాజ్యాలను నడిపించ గలడేమయ్య?
అజ్ఞాన గుణాల మాయతెగక
సుజ్ఞాన సంసార ముంటుందా అయ్యా
జీవన గుణమున్నంతదాక పరమాత్మని బోధకు పరుగులిడితే
స్వస్థిర చిత్తుడయ్యా
సంసార మాయయే ప్రాణాధికంగా నున్నవారికి ని:సంసార
ముండగలదా అయ్యా
పరమగురు పడువిడి సిద్ధ మల్లినాథ ప్రభూ /2494 [1]

Reference:

గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previous స్వతంత్ర సిద్ధలింగేశ్వరుడు దేశికేంద్ర సంగన బసవయ్య Next