| మకుటం | 
                    కూడల చెన్న సంగమదేవ
                     | 
                
                
                    | కాయకం:
                     | 
                    గురువు
                     | 
                
            
        
        
            బసవన పేరు కామధేనువు చూడండహో
            బసవన పేరు కల్పవృక్షము చూడండహో
            బసవన పేరు చింతాంణి చూడండహో
            బసవన పేరు పరసవేది చూడండహో
            బసవన పేరు సంజీవనమూలిక చూడండహో
            ఇటువంటి బసవ నామామృతము
            నా నాల్కపైనిండి పోంగిపోరలి మనసు నిండింది
            ఆ మనస్సు నిండి వెలువడి సకల కరణేంద్రియాల్లో నిండింది
            ఆ సకల కరణేంద్రయాలు నిండి పోంగిపోరలి
            సర్వాంగాలు రోమంచనమై నందున
            నేను బసవాక్షరమనే పడవనెక్కి
            బసవ బసవ బసవా అని
            భవసాగరము దాటానయ్యా అఖండేశ్వరా. - షణ్ముఖస్వామి/2480 
            [1]
            
            షణ్ముఖస్వామి: ఈతడు బసవోత్తర యుగానికి చెందిన ఒక ప్రముఖ వచనకారుడు. తండ్రి మల్లశెట్టెప్ప, తల్లి దొడ్డమాంబ. స్థలం గులబర్గా జిల్లాలోని జేవరిగి. గురువు ఆఖండేశ్వరుడు. కాలావధి క్రీ.శ. 1639-1711. మామూలు భక్తుడుగావున్న ఇతడు గురువు తరువాత జేవరగి విరక్త మఠాధిపతియైనాడు. లోక సంచారం చేబట్టి ధర్మతత్వ బొధచేసి, చివరికి జేవరగిలోనే ఐక్యం చెందాడు.
            
            
            షణ్ముఖస్వామి గారు 717 వచనాలు, 41 చౌపదుల్లో (నాలుగు పాదాల పద్యం) "అఖండేశ్వర జోలపదాలు", 7 పరివర్ధిని షట్పదుల్లో "పంచసంజ్ఞల పదాలు", భామిని షట్పదాల్లో "నిరాళ సద్గురు స్తోత్రం అనే కృతులు రచించారు, వచనాలు స్థలానుగుణంగా సంకలనమైనాయి. తూర్యనిరాలంబ శరణుని ఎరుకగల షట్-స్థల వచనాల అనేది కృతిపేరు.
            
            
            ఇది ప్రముఖంగా షట్-స్థల తత్వాన్ని నిరూపించే గ్రంథం. ఇప్పటికే అలవాటు (పద్ధతి)గా నడచివచ్చిన ఈ తత్వాన్ని సంప్రదాయపు అడుగు జాడల్లోనే చక్కని వ్యవస్థితంగా అంతే ఖచ్ఛితంగా నొక్కి చెప్పారు. అనుభావం తత్వం, సాహిత్యం ఈ మూడు వస్తువుల ముప్పిరిగొన్నవి.
        
            
             [1]
        
     
    Reference:
    
        గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద
        సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర
        సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.
    
    
        [1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu",
        ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation:
        G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.
    
    
    *