మకుటం
|
నిరుపమ నిరాళ మత్ప్రభు మహాంతయోగి
|
కాయకం:
|
గొప్ప అనుభావి
|
నాకాలు నాచేయి నాకన్ను నాముక్కు
ననోరు నాఒళ్ళు నామనసు నాప్రాణం
ఇవి మోదలుగా సమస్తము నాదనేది అదేది?
ఏది అవునో అదే తానయ్యే కదా!
నిరుపమ నిరాళ మహత్ప్రభు మహాంతయోగి /2464 [1]
మడివాళప్ప: కడకోళం మడివాళప్పగా ప్రసిద్ధుడైన ఇతడు 18వ శతాబ్ధికి చెందిన గొప్ప అనుభావి.
స్వస్థలం: గులబర్గా జిల్లా అఫజల్‍పూరు తాలూకా బిదనూరు. తల్లిదండ్రులు గంగమ్మ, విరూపాక్షస్వామి
గార్లు. దీక్షాగురు కలకేరి మరుళారాధ్యులు కడకోళ గ్రామం మడివాళప్ప కర్మభూమి. ఆ స్థలమందే
ఈయన జీవసమాధి అయినారు.
మడివాళప్ప రచించిన సాహిత్యం స్వర వచనాలు (తత్వపదాలు) మరియు వచనాలు అనే రెండు రూపాల్లో
దొరుకుతున్నాయి. సుమారుగా 500లకు మించిన స్వరవచనాలూ, 23 వచనాలూ దొరికాయి. స్వరవచనాల్లో
గురుమహాంత అన్నదీ, వచనాల్లో "నిరుపమ నిరాళ మత్ప్రభు మహాంతయోగి" అన్నదీ మకుటాలుగా ఉన్నాయి.
స్వర వచనాలు (పాటలు తత్వపదాలు) విడివిడిగా దొరకితే, వచనాలు "నిజలీలామృత వచన" అనే శిర్షిక
క్రింద కృతిరూపంగా దొరుకుతున్నాయి. ఇది ఒక స్థలబద్ధ కృతి. 20 స్థలాలున్నాయి 23 వచనాలకు
5 స్వర వచనాలూ జతచేయబడి వున్నాయి. లింగాయత షట్థ్సల తత్వ నిరూపణమే వీటి లక్ష్యం. అడపా
తడపా సమాజ విమర్శకూడా ఈ వచనాల్లో చోటుచేసుకొంది.
వచ్చినది వదలక రానిదాని కాసపడక
షడ్రసము లొక్కరీతిని చేకొని చవిగ భుజించి
చింతవిడిచి సంతోష మలుముకొని
నగవులకు పగలకొక్కటై తళతళమని మెరసి
వైరాగ్యమే ఆరోగ్యమై ఉండక, భవరోగ వ్యాధికి నెలవునై
సత్తు చచ్చిపోయింది అనంతకాల మనంత జన్మలందు
నిరుపమ నిరాళ మహాత్ప్రభు మహాంతయోగి / 2465 [1]
Reference:
గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద
సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర
సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.
[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu",
ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation:
G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.
*