Previous మళుబావి సోమణ్ణ మేదర కేతయ్య Next

మెరెమిండయ్య

మకుటం ఐఘటదూర రామేశ్వరలింగ

అంగంలో ఉండి చేతిలోకి వచ్చావు
చేతిలోంచి మనసుకెందుకు రావయ్యా?
నేను పాడితే, నీవు విని, నోరు చెవి నొవ్వవా అయ్యా?
నీవు చచ్చే దినం లేదు, నేను మిగిలే దినం లేదు
నీ అంగం అణగదు, నా మనసు ఉడుగదు
క్రియ అనే కొలిమిలో చిక్కి
మేలెరుగక మిడుకున్నాను
ఐఘటానికి ఠావు చెప్పుమా! ఐఘటదూర రామేశ్వర లింగమా! /1941 [1]

మెరెమిండయ్య: తమిళదేశపు 63 పురాతనుల్లో ఒకడైన మెరెమిండయ్యకు విభిన్నడితడు. బసవన్న సమకాలికుడైన శరణుడు. కాలం క్రీ.శ.1160. "ఐఘటదూర రామేశ్వరలింగ" అంకితముద్రతో వెలువడిన వచనాలు 110 అష్టావరణ, లింగాంగసామరస్య, తదితర తాత్విక విషయాలు, సామాజిక విడంబనలు, సరళశైలిలో నిరూపితమైనవి. శరణులనేకుల్ని గౌరవభావంతో స్మరించాడు.

బంగారం విశిష్టం, మన్ను అధమం అన్నప్పుడు
అది నిలిచి కరగుటకు
మట్టి బాన ఇల్లయినది
ఇష్టమెరిగిన వస్తువును నమ్మడానికిదే నిదర్శనం
ఐఘటదూర రామేశ్వర లింగము నెరుగుటకు /1947 [1]

తనవారన్యులు కారు
కాంతా కనకం మట్టి, పట్టిపోరడం వల్ల
ఆ మూడింటినీ వదలితే అన్యులు తన వారవుతారు
తెలిసిన వానికీ సరి, జగత్కాయుడైన వానికీ సరి
ఆశ ఒకటే తేడా, ఉభయానికి వెలిగా ఉండు
ఐఘటదూర రామేశ్వర లింగము నెరుగుటకు /1949 [1]

ఫలం రసమును నింపుకొని ఉన్నట్టు
నేల నిధానమును నిల్పుకొని ఉన్నట్టు
తల్లి గర్భమలో శిశువును పోషించుటలో ఓరిమితో వున్నట్లు
ఉంటివికదా నీవు గురై
తెలియదగు ఆత్మను దాచుకొని ఉంటివికదా జ్ఞాన సంపాదనకు
గురుతైన మూర్తిలో అంగమును మరచి, వస్తువును మరువకుండా వుండు
ఐఘటదూర రామేశ్వర లింగము నెరుగుటకు /1955 [1]

Reference:

గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previous మళుబావి సోమణ్ణ మేదర కేతయ్య Next
cheap jordans|wholesale air max|wholesale jordans|wholesale jewelry|wholesale jerseys