Previous అడపం రేచన్న స్వతంత్ర సిద్ధలింగేశ్వరుడు Next

హావినహాళు కల్లయ్య

మకుటం మహాలింగ కల్లేశ్వర

ఆయానాటి ప్రొద్దుటి సంసారం ఆయా ప్రోద్దే గ్రహిస్తుంది
ఎన్నడయ్యా మిమ్ము స్మరిస్తాను? ఎన్నడయ్యా మిమ్ము పూజిస్తాను?
సమచిత్తంతో మిమ్మల్ని స్మరిస్తే
రేపటికన్నా నేడే మంచిది మహాలింగ కల్లేశ్వరా /2182 [1]

హావినహాళు కల్లయ్య: కంసాలి కుటుంబానికి చేరిన ఇతని జన్మస్థలం విజయపుర (బిజాపుర) జిల్లాకు చెందిన హావినహాళు గ్రామం. అక్కడి కల్లినాథుడితని ఆరాధ్యదైవం. తండ్రి శివనయ్య, తల్లి సోమమ్మ. కాలం క్రీ.శ.1160. హరిహరుని రగళెలో ఇతడు చచ్చిన పామును బ్రతికించిన, కుక్కచే వేదాన్ని చదివించిన, పరకాయ ప్రవేశం చేసిన ఘటనలు చెప్పబడ్డాయి. ఇవన్నీ పవాడాత్మక ఘటనలుగా వున్నాయి. రేవణసిద్ధ, రుద్రముని, సిద్ధరాముల సాంగత్యంవల్ల శరణుడైన ఇతడు కల్యాణనగరికి వచ్చి అనుభవగోష్ఠలలో పాలుపంచుకున్నాడు. కల్యాణక్రాంతి పిదప సొన్నలాపురానికి వెళ్ళి అక్కడే ఐక్యమయ్యాడు. ఇతని సమాధి సోలాపురంలోని సిద్ధరామేశ్వర దేవాలయ ప్రాకారంలో వున్నది.

ఏ నేమాన్ని చేపట్టడు, ఏ కర్మాన్నీ పొందడు,
ఏ శీలాన్ని గ్రహించడు, ఏ తపస్సుకీ పూనుకోడు
ఏ గోడవలకీ పోడు, కేవలాత్మకుడు.
సాకారుడు నిరాకారుడనిపించుకున్న సహజుడతడే
మీ శరణుడు, మహాలింగ కల్లేశ్వరా /2187

"మహాలింగ కల్లేశ్వర" మకుటంతొ ఈయన వ్రాసిన 103 వచనాలు లభించి. అవి భక్తినిష్ఠ, శరణ తత్వ వివేచన, పరమత ఖండనం, నీతి బోధ, ఆత్మ నిరీక్షణ, శరణస్తుతి మొదలగు విషయాలు వివిధ ముఖాలుగా చర్చిస్తాయి.

ఒప్పి ఒప్పించుకోవాలి, ఒప్పకుంటే లేదు,
పలు కొమ్మలకు ఎగురకు, అజ్ఞాని!
గెంటి చూస్తాడు, తాకి చూస్తాడు,
తట్టి చూస్తాడు, నొక్కి చూస్తాడు,
గెంటితే, తట్టితే, నిష్ఠ నొదలకుంటే,
తన్ను తానిచ్చకొంటాడు మహాలింగ కల్లేశ్వరుడు / 2192 [1]

Reference:

గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previous అడపం రేచన్న స్వతంత్ర సిద్ధలింగేశ్వరుడు Next