Previous మోళిగె మహాదేవి మడివాళ మాచిదేవుడు Next

మడివాల మాచిదేవుని సమయాచారపు మల్లికార్జునుడు

మకుటం పరమ పంచాక్షరమూర్తి శాంతమల్లికార్జున

కరస్థలంలోని లింగాన్ని వదలి
ధరలోని ప్రతిమలకు ఒరిగే
నరకపు కుక్కల నేమందునయ్యా
పరమ పంచాక్షరమూర్తి శాంత మల్లికార్జునా./ 1901 [1]

మడివాల మాచిదేవుని సమయాచారపు మల్లికార్జునుడు: ఇతడు మడివాలు మాచెదేవుని అనుయాయిగా కానవస్తున్నాడు. కాలం క్రీ.శ. 1160. "పరమ పంచాక్షరమూర్తి శాంతమల్లికార్జున" అన్న అంకితముద్రతో వ్రాయబడ్డ 5 వచనాలు దొరికాయి. అన్నీ సమయాచార నిష్ఠను ప్రతిపాదిస్తాయి. ఇష్టలింగం ధరించి స్థావర లింగపూజ చేసేవారిని కటువుగా విమర్శిస్తాడు.

Reference:

గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previous మోళిగె మహాదేవి మడివాళ మాచిదేవుడు Next