Previous బాచి కాయకం బసవన్న తెలుగేశ మసనయ్య Next

తోంటద సిద్ధలింగ శివయోగి

మకుటం మహాలింగగురు సిద్ధేశ్వర ప్రభూ
కాయకం: గురువు, ధర్మప్రచారం

తల్లి లేని తండ్రి లేని
పుట్టు లేని, ఎవ్వరికీ కాని
అయోని సంభవుడవు నీవై నందున
నిన్ను నేను ని:కల లింగమన్నానయ్యా
మహాలింగ గురు శివసిద్దేశ్వర ప్రభూ /2336[1]

పేరు వెనుకటి తోంటద అంటే తోట అనే అర్థం. లింగాయత ధార్మిక చరిత్రలో తోంటద సిద్ధలింగ శివయోగిగారిదొక పెద్ద పేరు. అల్లమప్రభుదేవుని సంప్రదాయపు శూన్య పీఠాన్ని ఆరోహణ చేసి, బసవాదులు రూపొందించిన షట్థ్సల సిద్ధాంతలు వ్యాపకంగా ప్రచారంచేసి పన్నేండవ శతాబ్దంనాటి అనుభవమంటపం సంస్కృతిని పునరుజ్జీవితం కావించిన మహాపురుషుడు.

సిద్ధలింగ శివయోగుల జీవితం, సాధనసిద్ధులు వచన, కావ్య శాసనాల్లో నిక్షిప్తమై వున్నాయి. కర్ణాటక రాష్ట్రమంతా తల ఎత్తి నిలిచిన వీటి పేరిట గద్దెలు, మఠాలు, మందిరాలు ఈయన ప్రభావాన్ని చాటి చెబుతున్నాయి.

నూనెను త్రాగినవత్తి జ్యోతి తాకుతో జ్యోతియైనది గనుమా
సద్భక్తి స్నేహ మొహంతో లింగ స్పర్శను పొందగా
ఆభక్తుని తను, మన, కరణాలన్నీ లింగమైనవి గనుమా
లింగమునంటి మరిదేనిని తాకని నిర్మోహిని
మహేశ్వరుడంటాను గనుమా
మహాలింగ గురు శివసిద్దేశ్వర ప్రభూ /2337

దేహమే దేవలం, కాళ్ళే కంభాలు, శిరమే శిఖరం గనుమా
హృదయ కమల కర్ణికావాసమే సింహాసనం
మహాఘన పరతత్వమనే ప్రాణ లింగానికి రూపమిచ్చి
మహాదళ పద్మపుష్పంతో పూజించి
పరమ పరిణామమనే నైవేద్యము సమర్పించి
ప్రాణలింగానికి ప్రాణ సంబంధమైన
పూజను చేస్తున్నాను గనుమా
మహాలింగ గురు శివసిద్దేశ్వర ప్రభూ /2338

సిద్ధలింగయతులు జీవించింది 16వ శతాబ్ధంలో కర్ణాటకలో చామరాజ నగరజిల్లా హరదనహళ్ళి గ్రామం ఆయన జన్మ స్థలం. తండ్రి మల్లికార్జునుడు. తల్లి జ్ఞానాంబ, జీవనోపాదిక వ్యాపరమే ఆధారం. గోసల చెన్నబసవేశ్వరులు దీక్షా గురువు. కగ్గెర వద్దటి తోటలో ఆరునేలల కాలం అనుష్ఠానం చేసిన కారణంగా ’తోంటద సిద్ధలింగ’ అన్న పేరు వచ్చింది. సిద్ధగంగ మొదలైన క్షేత్రాలను దర్శించి చివరికి నాగినీ నది తీరపు ఎడయూరుకు వచ్చారు. అక్కడి సమీప గ్రామపు చెన్న వీరప్ప బడెయలు కట్టించి ఇచ్చిన రాతిమఠంలో నెలకొనివుండి, బోళ (బోడి) బసవనికి పట్టాధికారం ఒప్పగించి తాము నిర్వికల్ప సమాధిని పొందారు.

బసవాది శరణుల వచన సాహిత్యాన్ని సంగ్రహించే, సంకలించే, సంపాదించే కార్యభారాన్ని తమ శిష్యుల చేపట్టేట్టలు చేయడం, తాము స్వతహగా వచన రచనకు పూనుకోవటం తద్వారా కొనపూపిరితో నున్న వచన సాహిత్యాన్ని ప్రాణంపోసి కొనసాగేలా చేయడం, ఈ రెండూ శ్రీ సిద్ధలింగ శివయోగి గారు సమాజానికి సమర్పించిన భవ్యకానుకలుగా మిగిలాయి.

సిద్ధలింగ యోగిగారు 701 వచనాలు రచించారు. "మహాలింగగురు సిద్ధేశ్వర ప్రభూ" అన్న మకుటంతో అవి "షట్థ్సల జ్ఞానసారామృత" పేరిట స్థలకట్టు కృతిలో సంకలితమైనాయి. పేరే సూచిస్తున్నట్లు షట్థ్సల తత్వ నిరూపణయే వీటి వస్తువు.

చేతిలో పండు నుంచుకొని మానెక్కి కొమ్మవంచి
కాయను కోసుకొనే మందమతిలా
అనాది మూలాధపుడు
తన కరస్థల, మనస్థలాలలో నున్నది తానెరుగక
వేరెలింగముంది, వేరె క్షేత్రముంది అని
భిన్న లింగములకై పరిపరి యాచించు
ఈ వేశ్యాపుత్రులకు
గురువులేదు, లింగములేదు, జంగముడులేదు ప్రసాదంలేదు
ముక్తి అనే దేనాటికీ లేదు కనుమా
మహాలింగ గురు శివసిద్దేశ్వర ప్రభూ /2322

మగనితో సిగ్గుపడే భార్య బిడ్డల నెట్లుకన గలదయ్యా?
లింగముతో సిగ్గుపడే వాడు శరణు డెట్లౌనయ్యా?
ఈ లజ్జ సిగ్గులనే పాశమిదేమయ్యా
సంకల్ప వికల్పాలచే సందేహించే భ్రాంతియే లజ్జయయ్యా
ఔనో? కాదో? ఏమొ? ఎట్లో అని
పట్టుకొంటూ, వదలుతొండే లజ్జాభ్రాంతి తొలగి వుండాలయ్యా
మగని గురుతెరుగని సతికి లజ్జె సిగ్గులు కలుగునయ్యా
లింగము నెరుగని వానికి
సంకల్ప వికల్పమనే సందేహ భ్రాంతి కలిగేనయ్యా
ఈ ఎరుక, మరవులనే ఉభయాల ముసుగు తీసి
నెరుగా ఎరుకలో సన్నిహితమవ్వని జడులకు
లింగానుభవము జతగూడునా అయ్యా?
మహాలింగ గురు శివసిద్దేశ్వర ప్రభూ /2325 [1]

Reference:

గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previous బాచి కాయకం బసవన్న తెలుగేశ మసనయ్య Next