Previous సిద్ధాంతి వీరసంగయ్య సూళె (లంజ) సంకమ్మ Next

సుంక(ద) బంకణ్ణ

మకుటం బంకేశ్వరలింగ
కాయకం: సుంకం (పన్ను) వసులుచేసే కాయకం

అంగంలో వుండి అవధానివై
భావంలో వుండి భవచ్ఛేదనమై
సుఖంలో వుంటూ ప్రాణాంతకుడవై
సకలభోగాల ననుభవిస్తూ భోగవిరాగియై
బంకేశ్వర లింగాన్ని చూస్తూకూడ
చూడ నట్లుండు మదిలోని ఘనంలో నిలిచి! /2102 [1]

సుంక(ద) బంకణ్ణ: పురాణాల్లో ప్రస్తావించబడిన ఈతని కాలం క్రీ.శ.1160. సుంకం (పన్ను) వసులుచేసే కాయకం. "బంకేశ్వరలింగ" మకుటంతో 108 వచనాలు లభ్య మైనాయి. కాయక పరిభాషా పదజాలాన్ని ఉపయోగించుకొని తత్వవివేచన చేయడం వీటి ముఖ్యమైన ఆశయం. కొన్ని స్థలాల క్రింద వచనాలను విభాగించారు. గాత్రంలో చిన్నవైన వచనాలు సరళంగా వున్నాయి. కొన్ని మాత్రం మార్మిక పద్ధతిలో వున్నాయి. వ్యాపార పద్ధతి, సుంకాల విధానం, సరకులు రవాణాచేసే సాధనాల గురించిన వివరణలతో కూడిన వచనాలుండి సాంస్కృతిక దృష్టి కోణం నుండి ప్రాముఖ్యతను సంతరించుకొన్నాయి.

అన్నంపైని ఆసక్తి నిద్రపైని ఆసక్తి
అంగనల పైని ఆసక్తి లింగముపై నుండాలి
(ఇష్ట)లింగంలో మోహ మలవరచుకుంటే
తన్ను తానీయగలడు మన చెన్నబంక నాథదేవుడు /2103 [1]

క్షయకారణమనే పట్టణానికి లయకారణుడనే ప్రభువు
పొలిగాడు ప్రధాని, మదోన్మత్తుడు తలవరి
ఇలాంటి పట్టణ ప్రభువు
మరపుల మహారాజ్యాన్ని పాలిస్తూండగాను
అతనికి అడుగుల పైబడి బెదిరే వారెవరూ లేరు
తను బంకేశ్వర లింగాన్నికని తెలియని కారణంగా /2105 [1]

మనసు, బుద్ధి, చిత్తం, అహంకారము లనేవే తన వైరులు
నిర్మల సుచిత్తం దివ్యజ్ఞానమే తన కయినవాళ్ళు
పగను మరవగల్గితే
తనను తాను తెలుసుకొంటే దాని ప్రతిస్పందనే దివ్యజ్ఞానం
ఇట్టీ రెంటిని తెలుసుకో బంకేశ్వర లింగంలో /2107 [1]

Reference:

గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previous సిద్ధాంతి వీరసంగయ్య సూళె (లంజ) సంకమ్మ Next