కన్నద(కన్నపు) మారితందె (మారితండ్రి)
                     | 
                    
                    
                     | 
                
            
        
        
        
            
                
                    | మకుటం | 
                    మారును వైరి మారేశ్వరా | 
                
            
        
        చీకటిలో కన్నం వేస్తే
        నాకు కత్తినిచ్చిన కర్తకు భంగం
        వారు మరచి వున్నప్పుడు ఇల్లు దూరితే
        నా చోర తనపు తెలివికి భంగం
        మరచిన వారిని హెచ్చరించి వారికి వారి సొమ్ములు చూపి
        నా సొమ్ములు తెచ్చాను మారుని వైరి మారేశ్వరా! /1617             [1]
        
        కన్నద(కన్నపు) మారితందె (మారితండ్రి): మొదట చోరవృత్తిలో వున్న ఇతడు తరువాత శరణుడై పరివర్తన పొంది సాత్విక జీవనం గడుపుతాడు. కాలం క్రి.శ.1160, దొరికినవి 4 వచనాలు. "మారును వైరి మారేశ్వరా" అన్న మకుటం కలవి. అన్నింటా కన్నాలువేసే వృత్తిలోని పదాలు వాడుకొని ఆధ్యాత్మికతను చెబుతాడు.
         
        Reference:
        గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద         సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర         సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.
        [1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu",         ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation:         G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.
        
        *