Previous బాలసంగయ్యా బాచి కాయకం బసవన్న Next

బాచికాయకపు బసవన్నగారి పుణ్యస్త్రీ కాళమ్మ

మకుటం కర్మహర కాళేశ్వర
కాయకం: వడ్రంగం (Carpenter)

కాయకం తప్పితే సహించ కూడదూ
వ్రతం తప్పితే అసలు సహించ కూడదూ
కర్మహర కాళేశ్వరా / 1320 [1]

బాచికాయకపు బసవన్నగారి పుణ్యస్త్రీ కాళమ్మ: ఈమె వడ్రంగం కాయకంగా గలిగివున్న బాచికాయకపు బసవన్నగారి ధర్మపత్ని. కాలం క్రీ.శ. 1160 "కర్మహర కాళేశ్వర" అంకితంతో 2 వచనాలు లభించాయి. కాయకం, వ్రతం మరియు నుడుల మహాత్వాన్ని ఈ వచనాలలో ఒత్తిఒత్తి చెప్పబడ్డాయి. వృత్తి పదజాలంతో, ఉచితాలైన దృష్టాంతములతో చెప్పిన వచనాలు మనసు లోతులను తాకుతాయి.

చేయి తప్పి చెక్కితే కాలికి మూలం
మాట తప్పి పలికితే నోటికి మూలం
వ్రతహీనుని చేరితే నరకానికి మూలం
కర్మహర కాళేశ్వరా /1321 [1]

Reference:

గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previous బాలసంగయ్యా బాచి కాయకం బసవన్న Next
cheap jordans|wholesale air max|wholesale jordans|wholesale jewelry|wholesale jerseys