Previous శివనాగమయ్య శంకరదాసిమయ్య Next

వచనభండారి శాంతరసు

మకుటం అలేఖనాద శూన్య కల్లినొళగాద
కాయకం: వచనాలను వ్రాసుకొనే, సంగ్రహించే, సంరక్షించే పని

మలాన్ని కడుగ వచ్చుగానీ
అమలాన్ని కడగ గలమా? అయ్యా
మాట్లాడ వచ్చుగానీ తర్కించ వచ్చుగానీ
భ్రహ్మాన్ని తెలియ గలమా? అయ్యా
పని చేయవచ్చు గానీ
మర్మకూటం కూడనయ్యేనా? అయ్యా
యుద్ధ వ్యూహం చెప్పవచ్చుగానీ
పోరాడ గలమా? అయ్యా
మాటలు కలిపి కవిత చెప్పవచ్చునే కానీ
ఉమకాంతుని తెలియగలరా?
ఈ మాటల మాటకు బెదిరి
అలేఖుడైన శూన్య శిలలోనికి చేరాను చెప్పరా /2026 [1]

వచనభండారి శాంతరసు: ఇతడు కల్యాణ శరణులు రచించిన వచనాలను సంగ్రమించి పెట్టిన వచన భండారం పై విచారణను గమనించేవాడుగా వుండేవాడు. వచనాలను వ్రాసుకొనే, సంగ్రహించే, సంరక్షించే పని ఈతనిదని కనపడుతోంది. తొలుత బ్రాహ్మణుడై వుండి, బసవన్నగారి తోడి సాన్నిహిత్యంతో శరణధర్మాన్ని వరించినట్లు తెలిసింది. దీన్ని సమర్థిస్తూ ఈయన రచనల్లో మనకు ఆధారాలు దొరుకుతాయి. కాలం క్రీ.శ. 1160. "అలేఖనాద శూన్య కల్లినొళగాద" అన్న అంకితముద్రతో వ్రాసిన 64 వచనాలు దొరికాయి. వీటిలో తాను బ్రాహ్మణ్యాన్ని వదలిరావడం గురించి కల్యాణక్రాంతి పిదప ఏర్పడిన పరిస్థితిని, భండారం పాడైనప్పటి ఆవేదననూ విశేషంగా వ్యక్తపరుస్తాడు. షట్‍స్థల తత్వ నిరూపణనూ, అంతే నిష్ఠగా తెలిపాడు. ఎక్కువ వచనాలు మార్మిక పరిభాషలో వున్నాయి.

Reference:

గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previous శివనాగమయ్య శంకరదాసిమయ్య Next