Previous కరుళ (పేగుల) కేతయ్య కిన్నెర బ్రహ్మయ్య Next

కీలారం భిమన్న

మకుటం కర్మహర త్రిపురాంతక లింగ
కాయకం: పశువుల కాపరి

కర్పూరపు ప్రమిదలో వత్తివేసి వెలిగించవచ్చా?
మంటల మధ్యలో నిలబడి చెడుతుందని
గడ్డి గాదం తెచ్చి మండించవచ్చునా?
పదునుగా వుందని తన మేనిని పొడుచుకొని
ఖడ్గం పదును సులలిత మనవచ్చా?
ఆ గుణం అక్కడక్కడికే సరి
ఇది నిశ్చయం నిజలింగాంగికి జ్ఞాన బేధం
కాల కర్మ విరహిత త్రిపురాంతక లింగని తెలుసుకొన్న వాని తీరు / 1624 [1]

కీలారం భిమన్న: పసువుల కాపరిగా జీవితం సాగించిన ఇతని కాలం క్రి.శ.1160 "కర్మహర త్రిపురాంతక లింగ" మకుటంతో రచించిన వచనాలు 10 దొరికి, వాటిలో వృత్తి పదజాలపు సొంపులు పరచుకొన్నాయి.

వేటగానిలా, జాలరిలా, పసిడిదొంగలా
ఇలావంచక దొంగల్లా మాటల్లో బ్రహ్మం పలికి
సర్వ సంసారంలో లేస్తూ మునుగుతూ
వేగుతూ జోగుతూ మరి
బ్రహ్మానందపు సుఖులెట్లువుతారో?
ఇలా అనకూడదు సమయాన్ని తప్పకూడదు
క్రియను తెలుసుకొని జ్ఞానాన్ని మరవకుడదు
ఈ బేధాన్ని తెలుసుకొని ముందుసాగిన వానికి గాక
కాల కర్మ విరహిత త్రిపురాంతక లింగము సాధ్యం కాదు /1625[1]

Reference:

గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previous కరుళ (పేగుల) కేతయ్య కిన్నెర బ్రహ్మయ్య Next