కాలికణ్ణి (కాలకంటి ) కామమ్మ
|
|
మకుటం |
నిర్భీతనిజలింగ
|
కాయకం:
|
పగ్గాలునేసే కాయకము
|
నా కరణాలను లింగంలో కడతాను
గురులింగ జంగముల కాళ్ళు కడతాను
వ్రతభ్రష్టుల ఊపిరితేస్తాను
కాల్చి తురుతురుమని మంట రేపుతాను
నిర్భీతి నిజలింగంలో. /1306
[1]
కాలికణ్ణి (కాలకంటి ) కామమ్మ: ఈమె వివరాలేమీ తెలిసిరాలేదు. పేరు వెనకున్న దాని ప్రకారం ఈమె పగ్గాలునేసే కాయకము చేపట్టిన కుటుంబిని అని ఊహించవచ్చును. కాలం క్రి.శ.1160. "నిర్భీతనిజలింగ" అంకితముద్ర. ఒక్క వచనం మాత్రం దొరికింది వ్రతనిష్ఠ, వ్రతహీనుల విమర్శ ఇందులో ప్రముఖంగా వుంది.
Reference:
గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద
సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర
సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్బిఎన్:978-93-81457-05-4. 2012.
[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu",
ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation:
G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.
*