కన్నడి కాయకపు (మంగలి) అమ్మిదేవయ్య
|
|
మకుటం |
కమళేశ్వరలింగ |
కాయకం: |
మంగలవాఁడు, క్షౌరకుఁడు. |
ఏయే జాతి గోత్రాల నుండి వచ్చినా
తమ తమ కాయకానికి, భక్తికి సూతకం ఉండకూడదు
ఏ వ్రతాలను స్వికరించినా
ఎదుటి దాక్షిణ్యం మరచి
తన త్రికరణ శుద్దిగా సాగాలి
పర పురుషార్దాన్ని మూగ అరిగించుకో(గలడా)
మేధావులు చెప్పారని అమంగళాన్ని కలపవచ్చా?
ఇలా క్రియలో భావశుద్ధుడై
భావంలో దివ్య జ్ఞాన పరిపూర్ణుడైన గురుచర భక్తునికి
చెన్న బసవని సాక్షిగా
కమలేశ్వరలింగము తానే అని భావిస్తాడు - అద్దం కాయకపు అమ్మిదేవయ్య/1615 [1]
(మంగలి) కన్నడి కాయకపు అమ్మిదేవయ్య: కాలం క్రి.శ.1160లో వున్న ఈతడు మంగలి కాయకమువాడు. "కమళేశ్వరలింగ" మకుటంతో గల10 వచనాలు ఉపలబ్ధమయ్యాయి. అడపం, అద్దం, కత్తి, కత్తెర, చిమ్మటం, దువ్వెన మొదలైన వృత్తి పదాల్ని సహజంగా వాడుతొ అనుభావాన్ని ప్రకటించడం ఆత్మీయ మనిపిస్తుంది, "వ్యాధికి నేరాజును" అన్న మాట ఇతడు వైద్య శాస్త్రంలోనూ పరిణితుడనడాన్ని సూచిస్తొంది. 18 కాయకాలు ప్రకటించడం "ఏ జాతి గొత్రంలో పుట్టినా తమతమ కాయకానికి, భక్తికి మైల లేకుండా వుండాలి" అని చెప్పడం ఈతనిలోని సమతాభావ దీధితికి నిలువుటద్దంగా వుంది.
దివిటీ పట్టిన వానికి సందేహం కానీ
మండే కాంతికి సందేహమా?
సంసారపు సందడిలో
మన్మథుని ఆతృతలో
మునికి వేగేవానికి ఒత్తిడి కానీ
నిజ ప్రసంగి నిరతిశయ లింగాంగి, పరబ్రహ్మ పరిణామి
లోకపు జంజాటంలో చిక్కి పరిభ్రమణకు లోనవుతాడా?
ఈ నిజం తెలుసుకున్న వాడే
చెన్న బసవన్న సాక్షిగా
కమళేశ్వర లింగము తానే అన్నాడు /1616[1]
Reference:
గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.
[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.
*