మకుటం
|
మహాఘన దొడ్డదేశికార్య గురుప్రభూ
|
విత్తులో వుండే వృక్షఫలాన్ని రుచిచూడగలమా?
బిందువులో నుండే సతీ సంభోగము సంఘటించేనా?
వాన చినుకులో నుండే హురమంజి ముత్యాలు
మూలగాచేసి కంఠంలో ధరించగలమా?
పాలలోవున్న నెయ్యి వెదికతే దొరికేనా?
చెరుకులోనున్న బెల్లం కళ్ళకు కనిపిస్తుందా?
తనలోవున్న శివతత్వము తలచిన క్షణంలో అనుభవానికి వస్తుందా?
భావించి తెలిసి, మధించి ప్రయోగాంతరంలో ప్రసన్నము చేసికోని
ఆ అనుభవ సుఖంలో ఓలలాడడం
అతిచతురుడైన శరణునికి గాక అన్యలకు వీలుందా?
మహాఘన దొడ్డ దేశికార్య గురుప్రభూ /2466 [1]
ముమ్మడి కార్యేంద్ర: మాస్తి వంశస్థుడైన ఇమ్మడి కార్యేంద్రుడీతని తండ్రి, తల్లి కుప్పమాంబ.
గురువు దొడ్డదేశికార్య. కాలం క్రీ.శ.1700. ముమ్మడి కార్యక్షీతీంద్ర అని చెప్పుకొన్నందువల్ల
ఇతను రాజైవుండాలి. మైసూరు జిల్లా నంజనగూడు తాలూకాలోని ’కార్య’ గ్రామంలో దొరగావుండి
వుండవచ్చునని ఊహించడం జరిగింది.
వేద సంజీవిని అనేది కార్యేంద్రుని కృతి. ఇందులో 11 అధ్యాయాలు 125 వచనాలూ వున్నాయి.
"మహాఘన దొడ్డదేశికార్య గురుప్రభూ" అన్నదితని అంకితముద్ర గురువుగారు కలలో కనిపించి "జీవుల
పాపాలు తొలగించు పరతత్వ వచనాలను రచించిమని నిరూపమీయగా తాను చెప్పినట్లు తెలియపరుస్తాడు.
భక్తి అనే పాలను మనస్సులో పేరనిచ్చి
దానితో గడ్డగట్టిన ధృఢత్వపు పెరుగును
శరీరమనే పాత్రలో నింపి
తత్వమనే కవ్వంతో చిలుకగా
లింగమనే నవనీతము తేలిరాగా దాన్ని స్వీకరించి
జ్ఞానాగ్నిలో వెచ్చపెట్టగా
నిజవాసనతో ప్రకాశిస్తున్న నేయిని సేవించగా ఆ బలంతో
ఆత్మయే లింగమయింది కనుమా
మహాఘన దొడ్డ దేశికార్య గురుప్రభూ /2467 [1]
ఇది శుద్ధ తాత్వికకృతి. లింగాయత తత్వం వేదానికన్నా మెరుగుయింది. వేదాలపాలిటి సంజీవిని
లాంటిదని చాటడమే దీని ముఖ్యమైన ఉద్ధేశ్యం.
పగటివేళ చీకటి వుంటుందా?
రాతిరివేళ పగలుంటుందా?
జాగ్రత్సమయంలో స్వప్నాలుంటాయా?
దు:ఖమున్నప్పుడు ఆనందముంటుందా?
నీవు ప్రసన్నుడవై నప్పుడు నేనున్నాను?
నేను ప్రసన్నుడనై నప్పుడు నీవుంటావా?
నీవున్నకడ నేను లేను నేనున్నకడ నీవు లేవు
మహాఘన దొడ్డ దేశికార్య గురుప్రభూ /2468 [1]
Reference:
గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద
సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర
సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్బిఎన్:978-93-81457-05-4. 2012.
[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu",
ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation:
G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.
*