మకుటం |
గోళాకార విశ్వవిరహిత లింగ |
నీటి చినుకు వలన ఏర్పడిన ముత్యం
శాంతంగా వున్న తటాక జలంలో వేయగా
తొలుతటి తన స్వరూపం వచ్చిందని
తాను గట్టిపడలేదు
ఈ ముత్యం అరీతిగా నీటి చునుకులా మారలేదు
ముత్యం చినుకుల భేదాన్ని గ్రహించిన వారిని
ద్వైతాద్వైతాలు తెలిసిన వారంటాను
అలాకాక గెలుపోటములకు పోరాడే
రాతిగుండెల వారికి ఎక్కడ?
గోళకాకార విశ్వ విరహిత లింగము సాధ్యమయ్యేను? /2101
[1]
సిద్ధాంతి వీరసంగయ్య: ఇతడు తీవ్ర నిష్ఠ గల భక్తుడు. అనేక కావ్య పురాణాల్లో ఇతని నిష్ఠ ప్రసక్తమయింది. కాలం క్రీ. శ. 1160, 5 వచనాలు దొరికాయి. అంకితముద్ర "గోళాకార విశ్వవిరహిత లింగ" అన్నది. పేరుకు తగినట్లు సిద్ధాంత విషయాల నిరూపణే ఈ వచనాల ముఖ్యోద్ధేశంగా వుంది.
Reference:
గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద
సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర
సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్బిఎన్:978-93-81457-05-4. 2012.
[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu",
ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation:
G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.
*