జాతి జంగములు కోట్లనుకోట్లు | ధర్మ గురు బసవణ్ణగారు |
లింగాయత ధర్మం |
లింగాయత ధర్మం, సమానత్వం, సోదరభావం, నైతికత, పురోగతి, శ్రేయస్సు మరియు జ్ఞానము యొక్క గుర్తు!
శరణు బన్ని(స్వాగతం) లింగాయత, మహాత్మ బసవేశ్వరుచె స్థాపించ బడ్డ స్వతంత్ర అవైదిక ధర్మము.
జగమంత, గగనమంత మిక్కిలియంత మీయంత
పాతాళనికి క్రిందుగా అట్టట్టు మీ శ్రీ చరణం
బ్రహ్మాండంపై అట్టట్టు మీ శ్రీ మకుటం
అగమ్య అగోచర అప్రతిమ లింగమా! కూడల సంగమదేవా
నా కరస్థలానికి వచ్చి చులక నైతిరయ్యా - గురు బసవన్న/201 [1]
భారతదేశం అనేక మతాల పుట్టినిల్లుగా, అలాగే అనేక మతాలకు పోషకుడిగా ఉంది. (లింగవంత) లింగాయత, ధర్మ గురు బసవేశ్వరుల ద్వారా 12వ శతాబ్దంలో దక్షిణ భారతం, కర్ణాటక రాష్ట్రలొ ప్రారంభమైంది; లింగాయత ధర్మము, జన్మతః మానవులను ఎక్కువ తక్కువగా అని పరిగణింపక "మానవుడు అజ్ఞాని; జ్ఞాని శరణడు" అని బోధించెను. అజ్ఞానియగు మానవుడు జ్ఞానియైన శరణుడగుటకు కావలసిన దీక్షా సంస్కారమును, పూజా స్వాతంత్రమును అందరికి ఇచ్చును.
పుట్టుకతో అందరూ సమానము అని ఘోషించి జాతి వర్ణ భెదములేక ఆసక్తి కలవారందరూ దీక్షా సంస్కారమును పొందవచ్చునని చెప్పునది లింగాయత ధర్మము. వైద్యకీయ పరిక్షయందు ఉత్తిర్ణుడుకాక కేవలము వైద్యుని కుమారుడయనంతమాత్రమున వైద్యుడని చెప్పుకోనట ఎట్లు హాస్యాస్పదమో అట్లె సంస్కారము లేక జన్మతో మాత్రమె లింగాయతుడనుట హాస్యాస్పదము. కావున ఈ ధర్మము మేరకు మానవులందరూ పుట్టకతో భవులు; గురువుయోక్క అనుగ్రహమువలన భక్తలు శరణలు ఆగుదురు.
కీటకం పట్టుదారాల గూడు చేసుకొని చుట్టినట్లు |
లింగాయతంలో స్త్రీ గర్భవతిగానున్నప్పుడె ఏడెనిమిది నెలలున్నప్పడు బిడ్డకొరకు మంత్రొపదేశము చేయించి గర్భలింగ ధారణ చెయింపవలెను. తల్లియొక్క అహారవిహారములన్నియూ బిడ్డపై పరిణామము కల్గించుటవలన అధ్యాత్మిక సంస్కారము కూడా పరిణామమును కల్గించును. బిడ్డ జన్మీంచిన తరువాత బిడ్డకు ఇష్టలింగధారణ చెయడం మొదటి ఆచారం.
ఇష్టలింగదీక్ష: ఆడబిడ్డ కాని మగబిడ్డ కాని ఏ భేదమును లెక్కింపక వారికి గురువుయొక్క అనుగ్రహమును కలుగచెయవలెను. బిడ్డకు బుద్ధి వచ్చి, తన పూజాది కార్యములను తానె చెసికోనుటకు పదుమూడు, పదనాల్గు సంవత్సరములయిననూ కావలసియండును, ఆ వయస్సు వచ్చినప్పుడు ఇష్టలింగ దీక్షను చెయింపవలెను. దీక్షలేక మోక్షము లెదు. దానిని పొందుట ఆద్యకర్తవ్యము. ఇష్టలింగధారణము నిశ్చయకార్యమువలె; ఇష్టలింగ దీక్ష లగ్నకార్యమువంటిది.
ఎందెందు చూసినా అందందు నీవే దేవా!
సకల విస్తారపు రూపు నీవే దేవా
"విశ్వతో: చక్షు"వునీవే దేవా
"విశ్వతోముఖుడ"వు నీవే దేవా
"విశ్వతోబాహు"వు నీవే దేవా
"విశ్వతో పాదమీవే" దేవా, కూడల సంగమదేవా! - గురు బసవన్న/85 [1]
ఇష్టలింగదీక్షమనగా గురుకారుణ్యమును పొందుట మరియు లింగాంగి సంబంధియగుట. స్థూల, సూక్ష్మ కారణములను తనుత్రయమునందుండు కార్మిక మాయా ఆణవములను, మలత్రయుములను పోగొట్టి ఇష్ట, ప్రాణ, భావ లింగములను క్రీయామంత్ర, వేధాదీక్షలతొ సంబంధింప చెసి లింగాంగ సామరస్య మార్గమువైపున నడచునట్లు చెయునట్టి ధార్మిక సంస్కారమె దీక్ష. దినిని తిసుకొన్నప్పడు మాత్రమె తాను పరమాత్మని వైపు తిరిగికొన్నట్లు వ్యక్తి స్థిరికరించును. ధర్మగురువుయొక్క తత్వములను ఆచరించునుటను ఒప్పుకొన్నట్లగును. విశిష్ట ఆచార విచారములుగల సమాజముయొక్క ఒక అంగము అనుటను చూసినట్లగును.
ఒక సైద్ధాంతిక ఘటన ధర్మమనిపించుకొనుటకు దానికి తనదె అయిన ఏకాదశలక్షణములుండవలెను.
ధర్మగురు (ధర్మ స్థాపకలు): | మహాత్మా బసవేశ్వరడు (1134-1196) |
ధర్మగ్రంథం: | వచన సాహిత్యము |
ధర్మ భాష: | కన్నడ |
దేవుని పేరు: | లింగదేవ |
ధర్మలాంఛనము: | విశ్వాత్ముని చిహ్నమైన ఇష్టలింగము |
ధర్మ సంస్కారము : | ఇష్టలింగధారణ / ఇష్టలింగ దీక్ష |
సిద్ధాంతం: | శూన్య సిద్ధాంతం |
సాదన: | త్రాటక యోగం, (లింగాంగయోగం) |
దర్శనము: | షటస్థల దర్శనము; |
సమాజ శాస్త్రము: | శివాచారము (సామాజిక సామరస్యం) |
నీతి శాస్త్రం: | గణాచారము/ భృత్యాచారము |
అర్థ శాస్త్రం: | సదాచారము (కాయకమె కైలాసము, దాసోహమె దేవధామము, ప్రసాదము) |
సంస్కృతి: | అన్యసమాజములకంటె భిన్నమైన శరణ సంస్కృతి |
పరంపర: | మంత్రపురుషులైన బసవణ్ణగారు మొదలుగా ఆనాటినుండి అవ్యాహతముగా వచ్చిన శరణ పరంపర. |
ధర్మ ధ్వజము: | షటకోణ, ఇష్టలింగ చిహ్నకలగిన బసవ ధ్వజము. |
ధర్మ క్షేత్రాలు: | బసవణ్ణగారి ఐక్య క్షేత్రమైన కూడలసంగమము, శరణభూమి బసవ కల్యాణము. |
ధర్మ ధ్యేయము: | జాతి వర్ణ, వర్గ రహిత, ధర్మ సహిత కల్యాణ రాజ్య నిర్మాణము (శరణ సమాజ నిర్మాణము). |
జాతి జంగములు కోట్లనుకోట్లు | ధర్మ గురు బసవణ్ణగారు |